రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. కడప, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లోని ఆరుగురు నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు కడప జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, అత్తిగారి కృష్ణ, జోగినేని మణి అనుచరులు ఒక వర్గంగా, గుర్రప్ప అనుచరులు మరో వర్గంగా ఏర్పడి పార్టీ అబ్జర్వర్ బాలినేని ముందే కొట్టుకున్నంత పని చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించాల్సిన సమావేశం, ఇలా నేతల ఆధిపత్య పోరుకు వేదికగా మారడంపై హైకమాండ్ సీరియస్గా అయినట్టు తెలుస్తోంది.