ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెడ్లు అయినా, రావులు అయినా మా దగ్గరకే రావాల్సిందే” అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ముఖ్యమంత్రుల దగ్గరకు తాము వెళ్లమని, అవసరమైతే వాళ్లే తమ వద్దకు రావాలని ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రస్తావిస్తూ, ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ నిజంగా గెలిచిందా? అని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏమిటో స్పష్టంగా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

