
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలను పరిరక్షించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కళారూపాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో సాంస్కృతిక, కళారంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే కళాకారుల కృషిని గౌరవిస్తూ, వారికి అందరితోపాటు కాకుండా ప్రత్యేక పింఛన్ అందించే విధానాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.