అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. కానీ కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు నిరాధార కథనాలతో దిశ మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. పైలట్ ఇంధన స్విచ్‌ను ఆఫ్ చేశారని వదంతులు ప్రచారం కావడంతో విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) స్పందించింది.ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఏఏఐబీ స్పష్టం చేసింది. ఇప్పుడే తుది నిర్ణయం చెప్పడం సరైంది కాదని, ఇది త్వరిత చర్య అవుతుందని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు అసలు కారణాలు బయటపడవని చెప్పింది.

