తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇకపై ఇంటర్ మార్కుల మెమోలు, ధ్రువపత్రాలపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN)ను ముద్రించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు జారీ చేసే సర్టిఫికెట్లపై 11 అంకెల PEN నంబర్ కనిపించనుంది. దీంతో పాఠశాల విద్య నుంచి ఇంటర్, ఆ తర్వాత ఉన్నత విద్య వరకు విద్యార్థి కొనసాగిస్తున్న విద్యా వివరాలను అనుసంధానించే అవకాశం ఏర్పడనుంది. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను,ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుతున్న వారి వివరాలను PEN ద్వారా గుర్తించవచ్చు

