
అమెరికాలో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. ఒక్లహోమా(Oklahoma) స్టేట్ యూనివర్సిటీ (OSU) రెసిడెన్స్ హాల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరు OSU విద్యార్థి అని యూనివర్సిటీ పోలీసులు ధృవీకరించారు. ఘటన తర్వాత గాయపడిన వారందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు రెసిడెన్స్ హాల్‌కు తిరిగి వచ్చే సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.