అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కిరావడం లేదు. తాజాగా అమెరికాతో చర్చల్ని ఇరాన్ నిలిపివేసినట్లు సమాచారం. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇరాన్‌కు చెందిన తన్సిమ్ అనే మీడియా సంస్థ కొన్ని విషయాల్ని వెల్లడించింది. లెబనాన్ వంటి తమ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపనంతవరకు, వారి సూచనల్ని పరిగనణలోకి తీసుకోనంత వరకు చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.