పాకిస్తాన్‌లో మళ్లీ భారీ హింస చెలరేగింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా TLP సంస్థ చేపట్టిన ర్యాలీల్లో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాహోర్ , ఇస్లామాబాద్ , పెషావర్, క్వెట్టాతో సహా పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఇస్లామాబాద్‌లో అమెరికా ఎంబసీ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. లాహోర్‌లో పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. పలు చోట్ల పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

