భౌతిక శాస్త్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన 2026 నోబెల్ బహుమతి ఫ్రాన్సిస్ హాల్జెన్ను వరించింది. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి చేసిన నిర్ణయాత్మక కృషి, ఖగోళ మూలం గల అధిక-శక్తి న్యూట్రినోల ఆవిష్కరణకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. బెల్జియంలో జన్మించిన ఫ్రాన్సిస్ హాల్జెన్.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్లో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఐస్క్యూబ్కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కూడా ఉన్నారు.