మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. రూ. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతో ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 29న ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

