పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు’ చిత్రం విజయవంతం కావడానికి జనసేన కార్యకర్తలందరూ కృషి చేయాలని జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిలుపునిచ్చారు. ‘హరిహర వీరమల్లు’ అనేది ఒక చారిత్రాత్మక చిత్రమని, ఈ సినిమాలోని సందేశాన్ని జనసేన కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. అంతేగాకుండా జులై 23వ తేదీన రాత్రి జరిగే ప్రీమియర్ షోతో పాటు, జులై 24వ తేదీన టిక్కెట్లు దొరకని అభిమానులకు మనం తగిన సౌకర్యాలను కల్పించాలంటూ వెంకటరమణ తెలిపారు.

