రాష్ట్రంలో పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, ప్రజలందరి జీవన విధానంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సేవలను కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత కోసం రూ.573 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రూ.510 కోట్లతో 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

