“సింగరేణిపై పెట్టుబడులు కట్టుకథనాలను రాధాకష్ణ అల్లుతున్నారు. విషపు కథనాలను తొలి పలుకు పేరుతో రాస్తున్నారు. ఊహాకథనాలు అల్లుతూ.. రోజుకో రకంగా రాస్తున్నారు. తెలిసిన కొందరు వ్యక్తులకు సింగరేణిని కట్టబెట్టడం కోసం, సైట్ విజిట్ అనే కండీషన్ పెట్టారు అని కథనాల్లో రాశారు. అలా రాశారో లేదో వెంటనే ఇంకో ఆయన లేఖ రాశారు. ఇంకో ఆయన వెంటనే వచ్చేశారు. దీన్ని నేను ఆల్రెడీ ఖండించాను” అని భట్టి అన్నారు.

