ప్రముఖ సీనియర్ నటి బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజా దేవికి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం బెంగళూరులోని ఆమె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సరోజా దేవి తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. సరోజాదేవి దాదాపు 200 సినిమాలలో నటించారు. నటి బీ సరోజా దేవి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

