లింగ బైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో రాజ్ నిడిమోరు తో ఏడడుగులు వేసింది సమంత. సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఇక సమంత తన పెళ్లి ఫోటోలను అలా షేర్ చేసిందో లేదో ఇలా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కేవలం 16 గంటల్లోనే 79 లక్షలకు పైగా లైక్స్, కొన్ని లక్షల కామెంట్లు రావడం గమనార్హం. అలా రెండో పెళ్లితో మరోసారి ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది

