బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమార్తె, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్ పుతుల్పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సదరు సంస్థ నిరవధిక సెలవుపై పంపింది. మోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ కేసు నమోదు చేసిన నాలుగు నెలల తర్వాత..WHO ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె స్థానంలో కేథరీనా బోహ్మే తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నారు.

