తనపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనంలో రూ.13 వేలు తల్లుల ఖాతాలో వేసి, రూ.2 వేలు తన జేబులో వేసుకుంటున్నానని వైసీపీ ఆరోపణలు చేస్తుందని అన్నారు. అయితే తనపై చేసిన తీవ్రమైన ఆరోపణలను నిరూపించాలని… ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నానని… లేదా వెనక్కి తీసుకోవడం గానీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.

