ఫిబ్రవరి ప్రారంభంలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో సమావేశమవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు.అమెరికా సైనిక బలగాలు దాడి చేసి, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి జరిగినప్పటి నుంచి, పెట్రోపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్ బెదిరిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆయన స్వరం మార్చారు. గుస్తావో పెట్రోను శ్వేతసౌధాన్ని సందర్శించమని ఆహ్వానించారు.

