వైజాగ్ లో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరిస్తూ, ప్రజలపై యూజర్ చార్జీల భారం వేయడంపై వైఎస్సార్సీపీ మండిపడుతోంది. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వంటి సౌకర్యాల అభివృద్ధికి గతంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ప్రజలపై యూజర్ ఛార్జీలు వేయడం వివాదస్పదంగా మారింది. ముఖ్యంగా వాకింగ్ వంటి సాధారణ కార్యకలాపాలకే ఫీజులు విధించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపై స్టేడియాల్లో నడకకు వచ్చే వారికి రూ.720 ప్రవేశానికి రుసుము చెల్లించాల్సి రావడం, సాధారణ ప్రజలపై అదనపు భారం మోపే చర్యగా మారిందని వైసీపీ తెలిపింది.

