అమెరికాలో స్థిరపడాలనే కలలతో ఉన్న భారతీయ టెక్కీలకు, విద్యార్థులకు అగ్రరాజ్యం గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వంటి కీలక వీసాల ‘ప్రీమియం ప్రాసెసింగ్’ ఫీజులను భారీగా పెంచుతూ యూఎస్సీఐఎస్ నిర్ణయం తీసుకుంది. మార్చి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజులు ఇలా ఉండబోతున్నాయి. హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజు 2,965 డాలర్లకు పెరిగింది. అలాగే గ్రీన్ కార్డ్ దరఖాస్తుల(I-140) ఎంప్లాయిమెంట్ బేస్డ్ పిటిషన్ల ఫీజు కూడా 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు చేరింది.

