బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు షూరిటీ కింద 15వేల డాలర్ల వరకు బాండ్ చెల్లించాలని అగ్రరాజ్య విదేశాంగశాఖ ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో మంగళవారం నోటీసులు పబ్లిష్ చేయనుంది.
ఈ వీసా జారీ అయిన నాటి నుంచి 3నెలల వరకు అమెరికాలో ఉండే వీలుంటుంది,ఒక మనిషినే అనుమతిస్తారు. ప్రయాణికులు వీసా నిబంధనలను పూర్తిగా పాటించి, సరైన సమయంలోగా దేశం విడిచి వెళితే.. వారు చెల్లించిన బాండ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి వాపసు చేస్తామని అధికారులు వివరించారు.

