విశాఖకు పెట్రోల్ సెగ మొదలైంది. బంకుల వద్ద కార్లు, బైకులు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. మరోపక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అధికారులు చెబుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకోవాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు పార్టీ శ్రేణులతో కలిసి సిరిపురం ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌ను సందర్శించారు.

