ఢిల్లీ కాలుష్య సమస్యకు పరిష్కారాలు కనుగొంటున్నాం. ఢిల్లీని, విధులను వదిలి దగ్గు నయం కోసం ప్రతి ఆరు నెలలకు విపాసన కేంద్రానికి పారిపోయే వాళ్లం కాదు’ అని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బుద్ధుడు బోధించిన దైవిక ధ్యాన అభ్యాసాన్ని ఎగతాళి చేయడం ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు తగదని విమర్శించారు. ‘రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ విపాసనను ఎగతాళి చేయడం సీఎంకు తగదు’ అని అన్నారు.

