తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టివికె పార్టీ ఓడిపోతుందనే అనుమానంతో నటుడు విజయ్ దళపతి అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఓడిపోతాడనే అనుమానంతో అభిమాని కె మహేంద్రన్ (28) గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె (106), డిఎంకె(67), అన్నాడిఎంకె(61) స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి

