
విజయవాడ పున్నమిఘాట్ దగ్గర దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పున్నమి ఘాట్ లో ఏర్పాటుచేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్ని పిల్లలతో పాటు ఆనందంగా పంచుకున్నారు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి. అంతకుముందు చంద్రబాబు చేతుల మీదుగా పున్నమి ఘాట్ లో ఫైర్ క్రాకర్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. దీవాలి ఫైర్ క్రాకర్స్ పున్నమి ఘాట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.