మంత్రి లోకేశ్ రెడ్ బుక్.. బ్లడ్ బుక్‌గా మారిందని మాజీ మంత్రి, వైసిపి నేత విడదల రజని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు మాజీ మంత్రి విడదల రజిని చేరుకొని పాస్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. 2500 మంది వైసిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, దాదాపు 800 మందిపై హత్యాయత్నం జరిగిందని, 390 మందిని హత్య చేశారని రజని మండిపడ్డారు. 700 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

