అమరావతిలోని SRM యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ వేధింపుల బాగోతం వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ప్రొఫెసర్ ను తన కోరిక తీర్చాలంటూ బాధితురాలిపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఇన్స్టాగ్రామ్ లోని వానిష్ మోడ్ ఫీచర్ అడ్డుపెట్టుకుని అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.పోలీసులు ఐటీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం నిందితుడిని HOD పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

