లష్కరే తయ్యిబా సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై గుర్తు తెలియని సాయుధులు కాల్పులు జరిపారు. లాహోర్ లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ బయట ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి. నజీర్ అహ్మద్ ఘాజీ తోపాటు అమిర్ హమ్జా ప్రయాణిస్తున్న ఛానల్ వాహనంపై ఈ కాల్పులు జరిగాయి. ఘాజీ మాత్రం గాయపడకుండా తప్పించుకోగలిగారు. ఆమిర్ హమ్జాను ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది.

