ేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ‘SIR’ అంశంపై కీలక ప్రకటన చేసింది. రెండో దశలో అండమాన్ అండ్ నికోబార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో దశలో 51 కోట్లమంది ఓటర్లు SIR కార్యక్రమంలో భాగమవుతారని.. నవంబర్ 4 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. డిసెంబర్ 9న ముసాయిదా, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు

