మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌తో గెలిచిందన్న రాహుల్‌గాంధీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనో ధైరాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడడం తగదని ఈసీ వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్టు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికి మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది.

