భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో ఆయన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఈ విందుకు ఆహ్వానం అందలేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు మాత్రం రాష్ట్రపతి భవన్ నుండి విందుకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.