తన నటనతోనే కాకుండా పవర్ లిఫ్టింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు సీనియర్ నటి ప్రగతి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన యాక్టింగ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవర్ లిఫ్టింగ్‌లో ఇప్పటివరకూ నటి ప్రగతి జిల్లా, ప్రాంతీయ, సౌత్ ఇండియాతో పాటు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించారు. ఆదివారం టర్కీలో జరగబోయే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనబోతున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.