ప్రధాని మోదీ ఒక ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఖర్గేకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ (తొలిదశ)లో పోలింగ్‌కు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు.

