తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. కొన్ని గ్రామాలలో సమయంలో లైన్లో నిలబడిన ఓటర్లకు ఓటు వేయవచ్చును. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

