బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొల దశ పోలింగ్‌లో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. తనకు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఉన్న ట్రాక్ రికార్డు, తమ పట్ల ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అఖండ విజయం సాధిస్తుందని ఔరంగబాద్‌లో శుక్రవారంనాడు జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

