వైయస్ జగన్ మావిగన్ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరిస్తున్నారో ఇంతవరకు కూటమి నాయకులు చెప్పలేకపోయారన్నారు. నేరుగా సమాధానం చెప్పుకోలేక మంత్రులకు బూతు పాఠాలు రాసిచ్చి, పచ్చి అబద్ధాలు చెప్పించి వైయస్ జగన్ పై వ్యక్తిత్వ హననం చేశారన్నారు. మావిగన్ అంశాన్ని డైవర్టు చేస్తున్నామనే భ్రమల్లో బూతులు, అబద్ధాలతోనే కూటమి నాయకులంతా మావిగన్ కాన్సెప్టును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారన్నారు. ఆ విధంగానే ఇన్నాళ్లూ వాళ్లు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నం చేశారన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా తీయించే మార్గంలోకి నడిపిస్తున్నాడని విమర్శించారు.

