మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని తిట్టని మహిళ లేదు. మహిళా బిల్లును అడ్డుకుని ఏదో సంబురపడుతున్నారు. రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

