తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించడంతో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లకు స్థానం చలనం తప్పలేదు. ఇప్పటివరకూ రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విధులు
నిర్వహిస్తున్న జి.సుధీర్ బాబు ‘ఫ్యూచర్ సిటీ’కి సీపీగా నియమితులయ్యారు, సైబరాబాద్ ఎస్పీగా కొనసాగుతున్న అవినాష్ మహంతి మల్కాజిగిరి సీపీగా బదిలీ అయ్యారు, ఎం.రమేశ్ సైబరాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆక్షాంన్షు యాదవ్.. యాదాద్రి ఎస్పీగా వెళ్లనున్నారు.

