బెంగాల్ లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఆఫీస్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. బరబానిలోని టీఎంసీ ఆఫీస్ కు నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మంటలు భారీగా ఎగిసిపడిన నేపథ్యంలో ఆఫీస్ బూడిదైంది. అటు అసన్ సోన్ లోనూ టీఎంసీ ఆఫీస్ పై కొందరు దాడికి పాల్పడి ఆఫీస్ లోని కుర్చీలు, టేబుల్స్ ను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

