భారీ వర్షాల ఎఫెక్ట్ ముంబై మోనో రైలుపై కూడా పడింది. ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనోరైల్ ఆకస్మాత్తుగా మధ్యలో నిలిచిపోయింది. మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఆగిపోయింది. ‘‘మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఒక మోనో రైలులో స్వల్ప విద్యుత్ సరఫరా సమస్య తలెత్తింది. మా ఆపరేషన్, నిర్వహణ బృందాలు ఇప్పటికే రంగంలో దిగాయి. సమస్యను త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయి. ప్రస్తుతానికి వడాలా, చెంబూర్ మధ్య మోనో రైలు సేవలు ఒకే లైన్లో సజావుగా నడుస్తున్నాయి.

