వోల్వర్హాంప్టన్లో చోటుచేసుకున్న ఒక దారుణమైన జాత్యహంకార దాడి బ్రిటన్లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక రైల్వే స్టేషన్ బయట.. ముగ్గురు టీనేజర్లు ఇద్దరు సిక్కు పురుషులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి పవిత్రమైన తలపాగాలను బలవంతంగా తొలగించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో.. ఈ అమానవీయ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

