ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్ కేసులో నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు బుధవారం ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

