పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. విజయం మామూలుగా ఉండబోదని మొత్తం స్థానాల్లో మూడింట రెండొంతుల స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇవాళ మమతా బెనర్జీ కోల్కతాలో తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అదేవిధంగా కేంద్ర బలగాలు, పరిశీలకులపై మమతాబెనర్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది, కేంద్ర పరిశీలకులు మహిళలు సహా అందరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని, అమాయకులను కొడుతున్నారని మండిపడ్డారు.

