ఐపిఎల్‌లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన దేవ్‌దుత్ పడిక్కల్ 24 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. కెప్టెన్ పటిదార్ 19 పరుగులు చేశాడు.

