బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని తమ నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేడీయూ కోటాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వారిలో ఒకరు నితీష్ కుమారుడు ఉండనున్నారు.

