రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండరని.. బీజేపీలోకి వెళ్తాడని జోస్యం చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు మధ్యలో వారధిలా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని విమర్శలు గుప్పించారు. నాదెండ్ల భాస్కర్ రావుకు తాను ఒక్కడిని మాత్రమే కాదని.. ఆ రోజు ఇందిరా గాంధీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచినట్లు స్పష్టం చేశారు. అయితే ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అనుకుంటా అంటూ జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు.

