బంగ్లాదేశ్లో చోటుచేసుకుంటున్న హింస పట్ల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్న విషయం వాస్తవమే అని యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విశ్వాసంతో ఉన్నట్లు డుజారిక్ తెలిపారు.

