బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నీతీశ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. గతంలో బిహార్‌లో శాంతిభద్రతలు చాలా దారుణంగా ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వాటిని మెరుగుపరిచినట్లు తెలిపారు.
తన రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేశానని, కుటుంబం కోసం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిహార్ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ఉండటం వల్లే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

