“2018 ఎన్నికల్లో కాళేశ్వరాన్ని చూపించి లబ్ధి పొందారు. మేడిగడ్డ విషయంలో కేంద్రం సీబీఐ విచారణను ఇప్పటికీ ప్రారంభించలేదు. సీబీఐ విచారణ వెంటనే ప్రారంభించాలని మరోలేఖ రాశాం. రూ.1.50 లక్షల కోట్లలో రూ. లక్ష కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించారు. రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసే ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. రూ. సాంకేతిక నిపుణులతో పాటు మేం పరిశీలనకు వచ్చిన రోజే కేసీఆర్ మీటింగ్ పెట్టుకున్నారు. నిజాలు తెలియకూడదనే ఇవాళ కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

