వరల్డ్ ఛాంపియన్ రీచా ఘోష్‌కు ఇచ్చిన మాటను బెంగాల్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశ్వ విజేతగా తిరిగొచ్చిన రీచాకు డీఎస్పీ (DSP) హోదాను కట్టబెట్టింది. యావత్ దేశం, రాష్ట్రం గర్వించేలా చేసిన టీమిండియా స్టార్‌ను సిలిగురి ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా)గా నియమించారు. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ సమక్షంలో గురువారం రీచా బాధ్యతలు స్వీకరించింది. ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్లో ఘన స్వాగతంతో పాటు ఊహించని పదవి దక్కింది.

